తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తాత్కాలిక సిబ్బందిని నియమించారు. తాత్కాలిక డ్రైవర్, కండక్టర్లతో ప్రస్తుతం బస్సులను నడుపుతున్నారు. ఈ క్రమంలో తాత్కాలిక మహిళా కండక్టర్‌పై తాత్కాలిక డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నించాడు. ప్రయాణికులను ఎక్కించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ, పథకం ప్రకారం లైంగిక దాడికి యత్నించాడు.
అయితే.. ఆ మహిళా కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి తప్పించుకుంది. ఈ ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి జరిగినట్లు తెలిసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాత్కాలిక డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.
పులివెందుల అరాచకాలు రాష్ట్రం మొత్తం పేట్రేగాయి: చంద్రబాబు