telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఇక పై ఇసుక డోర్‌ డెలివరీ: మంత్రి పెద్దిరెడ్డి

peddireddy minister

ఏపీలో ఇసుక డోర్‌ డెలివరీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇసుక డోర్‌ డెలివరీ చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. జనవరి 7న తూర్పుగోదావరి, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో డోర్‌ డెలివరీ చేస్తామని తెలిపారు. జనవరి 20 కల్లా అన్ని జిల్లాల్లో ఇసుక డోర్‌ డెలివరీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. నెలకు 15 లక్షల టన్నుల ఇసుకను స్టాక్‌ చేస్తున్నామని పేర్కొన్నారు.

వర్షాకాలంలో ఇబ్బంది రాకుండా సీఎం జగన్ ఆదేశాల మేరకు 60 లక్షల టన్నుల ఇసుక స్టాక్‌ చేస్తున్నామని తెలిపారు.ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు 389 చెక్‌పోస్టులు, ఇసుక రీచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా పర్యవేక్షిస్తామని పెద్దిరెడ్డి చెప్పారు. దీంతో ఇసుక అక్రమ రవాణాకు పూర్తిగా అడ్డుకట్ట పడడంతో వినియోగదారులకు సకాలంలో ఇసుక లభ్యమవుతోందన్నారు.

Related posts