ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021కు సమయం దగ్గరపడింది. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తొలి పోరుకు సిద్ధమయ్యాయి. ఇక ఫార్మాట్ ఏదైనా రికార్డుల మీద రికార్డులు సాధిస్తూ వస్తోన్న పరుగుల మెషీన్, బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఐపీఎల్ 2021లో కూడా పలు రికార్డులపై కన్నేశాడు. ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 184 ఇన్నింగ్స్‌ల్లో 130.73 స్ట్రైక్ రేట్‌తో 38.16 సగటుతో 5878 పరుగులు చేశాడు. ఇంకో 122 పరుగులు చేస్తే.. టోర్నీ చరిత్రలో 6000 పరుగులు సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా విరాట్ అవతరిస్తాడు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కోహ్లీ ఆర్సీబీకే ఆడుతున్న విషయం తెలిసిందే. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సురేష్ రైనా (5368), డేవిడ్ వార్నర్ (5254), రోహిత్ శర్మ (5230)లు కోహ్లీ తర్వాత ఉన్నారు. గతేడాది రైనా లీగ్ ఆడకపోవడంతో కోహ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. . విరాట్ ఇప్పటి వరకు ఐదు సెంచరీలు నమోదు చేశాడు. లీగ్‌లో విండీస్ హార్డ్‌హిట్టర్ క్రిస్ గేల్ ఆరు శతకాలు బాదేశాడు.
టీ20 ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేసుకోవడానికి విరాట్ కోహ్లీకి ఇంకా 269 పరుగులు అవసరం. క్రిస్ గేల్, కీరన్ పోలార్డ్, షోయబ్ మాలిక్ మాత్రమే ఇప్పటివరకు టీ20 ఫార్మాట్‌లో పదివేల పరుగులు పూర్తి చేశారు. గేల్ 13 వేలకు పైగా పరుగులు చేసి అందరికంటే టాప్‌లో ఉన్నాడు. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ యావరేజ్ 46.90గా ఉంది. ఇది విరాట్ మిగతా పొజిషన్ల యావరేజ్ కంటే ఎక్కువ. మిగతా పొజిషన్లలో అతడి యావరేజ్ 34.0 మాత్రమే.
23 తర్వాత ఏపీ పౌరుషం ఏంటో తెలుస్తుంది: యామిని