telugu navyamedia
క్రీడలు వార్తలు

చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్…

ఢిల్లీ క్యాపిటల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 7 వికెట్ల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ధోనీ సేన నిర్ణీత సమయంలోపు మ్యాచ్‌ను ముగించలేకపోయింది. దాంతో ఐపీఎల్ నిబంధనలు ప్రకారం స్లో ఓవర్ రేట్ కింద కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు. ఇది మొదటి తప్పిదం కాబట్టి.. రూ.12 లక్షలతో సరిపెట్టారు. టోర్నీలో మరోసారి రిపీట్ అయితే జరిమానా రెట్టింపయ్యే అవకాశం ఉంది. ఇటీవల బీసీసీఐ విధించిన నిబంధనల ప్రకారం గంటకు 14.1 ఓవర్లు పూర్తి చేయాలి. అలాగే 20 ఓవర్లను 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఇందులో స్ట్రాటజిక్ టైమ్ ఔట్స్, అనూహ్య అంతరాయల సమయాన్ని మినహాయిస్తారు. కానీ ఢిల్లీ క్యాపిటల్స్​తో జరిగిన మ్యాచ్​లో ధోనీ సేన నిర్ణీత సమయంలో 18.4 ఓవర్లను మాత్రమే పూర్తి చేసింది. దీంతో కెప్టెన్ మహీపై చర్యలు తీసుకుంటు జరిమానా విధించారు. అయితే ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

Related posts