telugu navyamedia
క్రీడలు వార్తలు

రాహుల్ కు క్షమాపణలు చెప్పిన మాక్స్వెల్… ఎందుకంటే..?

ఐపీఎల్ 2020 ముగిసిన తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్ళింది. అందులో భాగంగా నిన్న ఈ రెండు జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. అందులో ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 374 పరుగులు చేయగా భారత్ 308 కే పరిమితమైపోయింది. అయితే ఈ మ్యాచ్ లో 19 బంతుల్లో 45 పరుగులతో రెచ్చిపోయిన ఆసీస్ ఆల్ రౌండర్ గ్లేన్ మాక్స్వెల్ ఐపీఎల్ లో దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. దాంతో మాక్స్వెల్ జట్టు అయిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ అతని పై సీరియస్ అయినట్లు చాలా మిమ్స్ వచ్చాయి. అలాంటి మిమ్ ను చుసిన కివీస్ ఆటగాడు జిమీ నిశమ్ దానిని పోస్ట్ చేస్తూ మాక్స్వెల్ ను ట్యాగ్ చేసాడు. అయితే దీని పై స్పందించిన మాక్స్వెల్… నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెనుక కీపింగ్ చేస్తున్న రాహుల్ కు క్షమాపణలు చెప్పను అని సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. అయితే ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆసీస్ జట్టులో డేవిడ్ వార్నర్ (69), ఆరోన్ ఫించ్ (114), స్మిత్ (105), మాక్స్వెల్ (45) పరుగులతో రెచ్చిపోవడంతో ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది.

Related posts