telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

చింతమనేనికి వచ్చే నెల 9 వరకూ రిమాండ్

Chintamaneni tdp

 జైల్లో ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్ట్ నిరాకరించిది. ఈ కేసు విచారణ సందర్భంగా పోలీసులు ఆయన్ని ఏలూరులోని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. వచ్చే నెల 9 వరకూ రిమాండ్ ను పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా, 2017లో ఒక స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి, కులం పేరుతో ఆ వ్యక్తిని దూషించారన్న ఆరోపణలపై చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసునమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి చింతమనేని దాఖలు చేసిన బెయిట్ పిటిషన్ పై కూడా విచారణ జరిగింది.

Related posts