telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈబీసీ రిజర్వేషన్ల బిల్లుకు లోక్‌సభ ఆమోదం

E B C Bill Passes Lok Sabha

అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పించే ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 323 ఓట్లు, వ్యతిరేకంగా 3 ఓట్లు మాత్రమే వచ్చాయి. లోక్‌సభలో ఆమోదంతో ఈబీసీ బిల్లు నేడు రాజ్యసభ ముందుకు రానుంది. 124వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోద ముద్ర పడింది. మూడింట రెండొంతులకు పైగా సభ్యులు ఈబీసీ బిల్లుకు మద్దతు తెలిపారు. సభలో ఉన్నవారిలో కేవలం ముగ్గురు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈబీసీ బిల్లు ఆమోదం పొందినట్లు ప్రకటించారు. 

బిల్లును కేంద్ర మంత్రి థావర్ చంద్ గహ్లోత్ లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇది చారిత్రాత్మక నిర్ణయమన్నారు. ఈ రిజర్వేషన్ల ద్వారా బీసీ, ఎస్సీ రిజర్వేషన్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్నారు. ఈబీసీ రిజర్వేషన్లపై చర్చ సందర్భంగా ముస్లింలకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పంచాలని‌ టీఆర్ఎస్ సభ్యులు నినాదాలు చేశారు. సభలో ఈబీసీల రిజరేషన్లకు సంబంధించిన అర్హత ధ్రువీకణలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. బిల్లు ఆమోదం పొందిన అనంతరం లోక్‌సభ నిరవధికంగా వాయిదాపడింది.

Related posts