చీకటిని చీల్చుకువచ్చిన…..
చిరు కిరణం వెలుగులా……
భూమిని చీల్చుకుని పైకి ……
వచ్చిన విత్తు లా……
సముద్రం లో ఆగిపోని…….
అలల ప్రయాణం లా……..
ఎగసి పడ్డా మళ్లీ మళ్లీ….
పైకి లేచే కెరటం లా…..
నీలి మేఘం నుంచి …….
ఉరుముల మెరుపుల మద్య నుండి…..
జాలువారిన తొలకరి జల్లు లా…..
చీకటి అనే నిరాశా నిస్పృహలు నుండి …..
విజయం అనే వెలుగు వైపు కు…..
అడుగడుగున ఆటంకం వంటి….
ముళ్ల దారి నుండి……
ఆశ అనే పూల దారి లో
ప్రయాణం సాగిస్తూనే ఉండు……
ఆగకు ఆగిపోకు అరక్షణమైనా…..
నిత్యం శ్రమించే చిన్ని ప్రాణి చీమ లా……
చలించక,వెనకడుగు వేయక …..
సాగిపో ఆగక అరక్షణమైనా!
-జె.పద్మావతి
ఆదోని.