వైసీపీ అధినేత సంకల్పించిన పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా బ్రహ్మాండమైన పైలాన్ ను ఏర్పాటు చేశారు. దాదాపు 341 రోజులుగా సాగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ ప్రజా సంకల్పయాత్ర నేడు ముగియనుంది. ఇచ్ఛాపురం సమీపంలోని కొజ్జీరియా గ్రామం నుంచి జగన్ చివరి రోజు పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఆపై ఉదయం 11 గంటల సమయానికి లొద్దపుట్టి వద్ద ఏర్పాటైన మధ్యాహ్న భోజన విరామం శిబిరానికి చేరుకునే ఆయన, ఒంటిగంటకు బయలుదేరుతారు. అక్కడి నుంచి నడుచుకుంటూ, ఇచ్ఛాపురంలో ఏర్పాటు చేసిన పైలాన్ వద్దకు వెళతారు. ఆపై పాతబస్టాండు వరకూ నడుస్తారు.
సందర్భంగా అక్కడే భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ప్రజాసంకల్ప యాత్ర భావి తరాలకు గుర్తుండిపోయేలా చూసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు సుందరమైన పైలాన్ ను నిర్మించారు. మంగళవారం సాయంత్రానికే పైలాన్ నిర్మాణం పనులు పూర్తికాగా, రాత్రి వేళ విద్యుద్దీప కాంతుల మధ్య ఇలా వెలుగులీనుతోంది.
Live from #PrajaSankalpaYatra #VijayaSankalpam https://t.co/AxG1SHqUn6
— YSR Congress Party (@YSRCParty) January 9, 2019
పీపీఏలపై హైకోర్టు తీర్పు జగన్ సర్కారు కు చెంప పెట్టు: కళా వెంకట్రావ్