బుల్లితెర సూపర్ హిట్ షో బిగ్ బాస్ ఆరవ వారంలోకి వచ్చింది. ఇప్పుడు ఈ కార్యక్రమం మరింత రసవత్తరంగా మారుతుంది. ఈ కార్యక్రమంలో ఇప్పటికే ఐదు వారాలు పూర్తి కాగా… ఇంటి నుండి హేమ, జాఫర్, తమన్నా, రోహిణి, అషూ రెడ్డి బయటకి వెళ్ళారు. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 11 మంది సభ్యులు ఉన్నారు. ఆరోవారం ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఆసక్తికరంగా సాగగా, ఈ వారం నామినేషన్‌లో మహేష్, రాహుల్, వరుణ్ సందేశ్, రవి కృష్ణ, హిమజ, పునర్నవి ఉన్నారు. బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు జరగని డీల్‌ని ఈ సారి నామినేషన్‌లో ఉన్న సభ్యులకి ఇచ్చారు. డీల్ ప్రకారం ఆరుగురు ఇంటి సభ్యులలో ముగ్గురు .. వేరే ముగ్గురి కోసం త్యాగం చేయాలని ఉంటుందని చెప్పాడు. దీనికి ఓకే చెప్పిన మహేష్, పునర్నవి, హిమజ ఛాలెంజ్ నుండి తప్పుకున్నారు. రవికృష్ణ, రాహుల్, వరుణ్ సందేశ్ ఇమ్యునిటీ పొందేందుకు ఛాలెంజ్‌ని స్వీకరించి ఎలాంటి టాస్క్‌లో అయిన పాల్గొనేందుకు తాము సిద్ధం అని చెప్పారు.
టాస్క్‌లో భాగంగా యాక్టివిటీ రూంలో బోర్డుపై మొత్తం 8 ఛాలెంజ్‌లు రాసి పెట్టారు. వీటిలో రెండింటిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఇందులో భాగంగా రవి .. ఒకరి తలనిండా షేవింగ్ ఫోమ్ రాయాలి, ఒకరి బెడ్‌ని పూర్తిగా నీటితో తడపాలి అనే ఆప్షన్స్ ఎంపిక చేసుకున్నాడు. రంగంలోకి దిగిన రవి.. వితికా తలని పూర్తిగా షేవింగ్ ఫోమ్‌తో నింపాడు. సావిత్రి బెడ్‌ని పూర్తిగా తడిపి తనకి ఇచ్చిన ఛాలెంజ్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాడు.
తర్వాత రాహుల్ సిప్లిగంజ్ ఎనిమిది ఆప్షన్స్‌లో రెండు ఆప్షన్స్ ఎంపిక చేసుకున్నాడు. ఇంట్లో ఒకరికి బాగా కోపం తెప్పించి వారు మీపై అరిచేలా చేసి వారితో గొడవ పడాలి . రెండోది వరుణ్ మరియు వితిక హార్ట్ షేప్ కుషన్‌ని కట్ చేసి స్విమ్మింగ్ పూల్‌లో విసరాలి. ఛాలెంజ్‌లో భాగంగా హార్డ్ షేప్ కుషన్‌ని ఈజీగానే కట్ చేసి స్విమ్మింగ్ పూల్ లో పడేసిన రాహుల్.. రెండో ఛాలెంజ్ సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసేందుకు కొద్దిగా నోరుజారాడు. దీంతో మిగతా సభ్యులు కూడా ఆయనకి ధీటుగా బదులిచ్చారు. డోర్ నెట్టుకొని లోపలికి వెళ్ళే ప్రయత్నం రాహుల్ చేయగా ఆయనని అలీ, హిమజ, వితికా, బాబా భాస్కర్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రాహుల్ హిమజని ఎత్తుకొని పక్కకి పడేశాడు. దీంతో రాహుల్, హిమజల మధ్య మాటల యుద్దం జరిగింది. రాహుల్.. ‘‘పిచ్చి మెంటలా నీకు.. ఫాల్తు మొఖం చేతలు చేయకు’’ అన్నాడు. వెంటనే రాహుల్ మీదుకి దీసుకెళ్లిన హిమజ.. ‘‘మొహం పగులుద్ది.. చెప్పుతెగుద్ది చెబుతున్నాను.. బేవార్స్’’ అంటూ ఊగిపోయింది. ఇప్పటి వరకు హౌజ్‌లో ఒకటిగా ఉన్న వరుణ్, వితికాల మధ్య కాస్త దూరం పెరిగేలా చేసింది బిగ్ బాస్ ఛాలెంజ్. వితికాని రాహుల్ పక్కకి నెట్టే సమయంలో ఆమె గాయపడింది. అయితే ఈ తతంగాన్ని చూస్తున్న వరుణ్ సందేశ్ భర్తగా ఉండి తనకి ఏమి సాయం చేయలేదని వితికా మండిపడింది. ఇది టాస్క్. దీనిని స్పోర్టివ్‌గా తీసుకోవాలి అని వరుణ్ ఆమెపై ఎగిరాడు. మిగతా ఇంటి సభ్యులు వీరిద్దరి మధ్య తలెత్తిన వివాదాన్ని కూల్‌గా సాల్వ్ చేసే ప్రయత్నం చేశారు.
తనకి ఇచ్చిన ఛాలెంజ్ కోసం రంగంలోకి దిగాడు వరుణ్ సందేశ్. ఛాలెంజ్‌లో భాగంగా .. చల్లని కాఫీని ఒకరి మీదకి విసరాలి, రెండోది హౌస్‌లో ఎవరైనా ఒకరి ఇష్టమైన బట్టలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. ఈ రెండింటిని తన భార్య వితికా మీద అప్లై చేసి సేఫ్ గేమ్ ఆడాడు. వితికాని ప్రేమగా పిలుస్తూ తన మీద చల్లని కాఫీ విసిరాడు. అలానే బెడ్ రూంలోకి వెళ్లి వితికా డ్రెస్ ని చింపేశాడు. దీంతో ముగ్గురి ఛాలెంజ్‌లు పూర్తయ్యాయి. కొద్ది సేపటి తర్వాత బిగ్ బాస్ లివింగ్ ఏరియాలో ఉన్న ఇంటి సభ్యుల ముందు అసలు విషయం చెప్పాడు. డీల్ కుదుర్చుకున్న ముగ్గురు ఇంటి సభ్యులు (వరుణ్ సందేశ్, రవికృష్ణ, రాహుల్) తమకిచ్చిన ఛాలెంజ్‌ని సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశారు. దీంతో వారు ఈ వారం ఎలిమినేషన్ నుండి తప్పుకున్నారు. వారి ముగ్గురికి ఇమ్యునిటీ కూడా లభించింది అని బిగ్ బాస్ పేర్కొన్నారు. ఇక ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్ అని తెలిపారు బిగ్ బాస్. రాహుల్ ఆడిన గేమ్ మాకు అస్సలు నచ్చలేదని ఆయనపై కాస్త ఫైర్ అయింది శ్రీముఖి. మిగతా ఇద్దరు మంచిగా ఆడినప్పుడు నువ్వు నోరు ఎందుకు జారావు, చేతులతో ఎందుకు నెట్టావు అని ఆయనపై గరం అయింది. తనది తప్పే అని ఒప్పుకొని రాహుల్.. శ్రీముఖి కాళ్ళు పట్టుకున్నాడు. ఎప్పటిలానే తనతో ఉండాలని, ప్రవర్తలనలో అస్సలు మార్పు రావద్దు అని ప్రాధేయపడ్డాడు. దీంతో మంగళవారం ఎపిసోడ్ ముగసింది.