telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టిఆర్ఎస్ వందల కోట్లు విచ్చలవిడిగా పంచుతోంది

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ మండిపడ్డారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో పోలీస్ ల పక్షపాత వైఖరి, అధికార దుర్వినియోగం కనిపిస్తోందన్నారు. బీజేపీ, టిఆర్ఎస్ డబ్బులతో గెలువాలనే కుట్ర చేస్తున్నాయని..టిఆర్ఎస్ వందల కోట్లు విచ్చలవిడిగా పంచుతోందని ఫైర్ అయ్యారు. పోలీస్ లు ఇప్పటివరకు అధికార పార్టీ డబ్బులు ఒక్క రూపాయి కూడా పట్టుకోలేదని..పోలీస్ ల పక్షపాత వైఖరి స్పష్టం అవుతోందని స్పష్టం చేశారు. ఓ పార్టీ అభ్యర్థి ఇంట్లో పోలీస్ లే డబ్బులు పెడుతున్నట్లు వీడియో లు వస్తున్నాయని..సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని పోలీస్ ల వల్ల దుబ్బాకలో ఎన్నికలు ఫెయిర్ గా జరిగే అవకాశం లేదని పేర్కొన్నారు. కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో ఖాళీ అయిన దుబ్బాక అసెంబ్లీ స్థానం కోసం ఉప ఎన్నిక జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబరు 9న వెలువడింది. నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ కూడా ముగిసింది. ఈ ఉప ఎన్నిక నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహించి.. అదే నెల 10న ఫలితాలు విడుదల చేయనుంది. ప్రస్తుతం బరిలో 23 మంది అభ్యర్థులు ఉన్నారు.

Related posts