telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“సుల్తాన్”పై రష్మిక ఎమోషనల్ ట్వీట్

Rashmika

తమిళ హీరో కార్తీ తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘సుల్తాన్‌’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ‘రెమో’ ఫేమ్‌ బక్కియరాజ్‌ కణ్ణన్‌ దర్శకుడు. రష్మిక హీరోయిన్‌. తెలుగులో స్టార్ కథానాయకిగా కొనసాగుతూనే తమిళ పరిశ్రమ మీద కూడ దృష్టి పెట్టింది హీరోయిన్ రష్మిక మందన్న. తమిళంలో ఆమె నటిస్తున్నమొదటి సినిమా ‘సుల్తాన్’. ఈ చిత్రంతో కొలీవుడ్ పరిశ్రమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలని రష్మిక భావిస్తోంది. తమిళంలో తన తొలి సినిమా గురించి రష్మిక ఎమోషనల్‌గా స్పందించింది. “చిన్నప్పటి నుంచి నాన్న, నేను ఎక్కువగా తమిళ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు ఇంత పెద్ద తమిళ సినిమాలో నేను నటించడం నమ్మలేనట్టుగా ఉంది. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. నేను నిజంగా కృతజ్ఞురాలిని” అని రష్మిక ట్వీట్ చేసింది. ఎస్‌.ఆర్‌. ప్రకాశ్‌ బాబు, ఎస్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ కు మంచి స్పందన లభిస్తోంది.

Related posts