telugu navyamedia
క్రీడలు వార్తలు

సైనీ బైక్ ఫిట్… అభిమానుల ఆగ్రహం

హార్లీ డేవిడ్‌సన్‌ బైక్‌పై షర్ట్ లేకుండా కూర్చొని ఓ మట్టి రోడ్డులో దుమ్మురేపుతున్న వీడియోను సైనీ ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్. దానికి ‘భయాన్ని చూడాలంటే నాతో పాటు బైక్‌ మీద కూర్చోండి’ అంటూ క్యాప్షన్‌గా జతచేశాడు. ఈ పోస్టుకు నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన లభించింది. ఆ స్టంట్‌ చూసిన కొందరు నవ్‌దీప్‌ను మెచ్చుకోగా మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేసారు. క్రికెటర్ అయుండి ఇలా బాధ్యాతారాహిత్యంగా వ్యవహరిస్తారా? అని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేయగా.. కుర్రాళ్లు నిన్న ఆదర్శంగా తీసుకొని ప్రమాదాలు గురైతే బాధ్యులెవరని మరొకరు మండిపడ్డారు. ‘ఒక క్రికెటర్‌ అయ్యుండి ఇలాగేనా చేసిది?ముందు బౌలింగ్‌ మీద దృష్టి పెట్టు. ఇలాంటి వాటితో ఒరిగేదేం లేదు. జట్టులో కొనసాగాలంటే నిరంతరం కష్టపడాలి. సచిన్‌, వినోద్‌ కాంబ్లీ.. ఇద్దరూ నైపుణ్యమున్న ఆటగాళ్లే. కానీ చివరికి ఎవరెలా ఉన్నారో నీకు తెలుసు కదా. హీరోలా ఎక్కువ చేయకు.’అని మరొకరు మండిపడ్డారు. ఈ తరహా ఎచ్చిడే తగ్గించుకుంటే మంచిదని మరొకరు కామెంట్ చేశారు. ‘భారత జట్టుకు నువ్వు ఎంపికై రెండేళ్లు కూడా కాలేదు. కాలుష్య నియంత్రణ అధికారులు ఎవరైనా ఈ వీడియోను చూడండి. ఇలా చేయడం వల్ల కాలుష్యం పెరిగిపోతోంది. ఎవరైనా సాధారణ యువకులు ఇలా చేస్తే ఊరుకుంటారా?’ అని ఘాటుగా విమర్శలు గుప్పిస్తారు.

Related posts