telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్..

jagan

వైయస్ జగన్ ప్రభుత్వానికి కేంద్రం మరో షాక్ ఇచ్చింది. పీపీఏలను రద్దు చేయొద్దని ఆదేశించింది. ఈ మేరకు విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. పబ్లిక్ హియరింగ్‌లను చేపట్టవద్దని రెగ్యులేటరీ కమిషన్‌కు ఆదేశించింది. ధరల స్వీకరణ పిటిషన్ ఉపసంహరణను ట్రిబ్యునల్ తప్పుపట్టింది. పీపీఏల రద్దుపై అప్పిలేట్ ట్రిబ్యునల్‌ను మూడు కంపెనీలు ఆశ్రయించాయి. కడప, అనంత జిల్లాకు చెందిన మూడు కంపెనీలు ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాయి. ఎస్‌బీఈ, అయన, స్పింగ్ కంపెనీల పిటిషన్లపై విచారణ చేసింది.

పీపీఏల రద్దు విషయంలో జగన్ కాస్త వెనక్కి తగ్గారు. అవకతవకలు జరిగినట్టుగా ధృవీకరించిన ఒప్పందాలనే పున:సమీక్షించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు హయాంలో ప్రభుత్వం ఎక్కువ ధరకు ప్రైవేట్ విద్యుత్ సంస్థల నుండి ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు చేసిందని జగన్ సర్కార్ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Related posts