telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఇవన్నీ .. రాజధాని మార్పుకు శ్రీకారం.. : చంద్రబాబు

chandrababu

ఏపీ రాజధానిపై ప్రభుత్వ మంత్రి చేసిన వ్యాఖ్యలపై అపోహలు పెరిగిపోతున్నాయి. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పందించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోని ఘంటసాల మండలం శ్రీకాకుళంలో వరద బాధితులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాజధాని మార్చాలనే కుట్రతోనే ముంపు ప్రాంతమని చర్చకు తెరలేపారని, ఈ కుట్రలపై ఎంత వరకైనా పోరాడతామని అన్నారు.

ఈ కుట్ర, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, ప్రాజెక్టుల నిర్మాణాలు నిలిచిపోయాయని, ఏ పనీ కావడం లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకూ తాను అండగా ఉంటానని, పోరాడతానని హామీ ఇచ్చారు. ప్రపంచంలోని ఐదు అద్భుత నగరాల్లో అమరావతి ఉండాలనుకున్నామని, ముంపు ప్రాంతం, ఖర్చు నెపంతో అమరావతి నిర్మాణాన్ని ఆపేస్తున్నారని, ఇలాంటి పనులు చేస్తే అమరావతికి పెట్టుబడులు రావని మండిపడ్డారు. అమరావతికి ఎసరు పెట్టారని, ఇక్కడి పనులు ఆగిపోయాక హైదరాబాద్ లో భూమి విలున ముప్పై శాతం పెరిగిందని అన్నారు. రాజధాని అమరావతి కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, మౌలిక వసతులు పోగా 8 వేల ఎకరాల వరకూ మిగులుతుందని, ఈ భూమి అమ్మినా ఖర్చు లేకుండా రాజధాని నిర్మించ వచ్చని అన్నారు.

Related posts