అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే, సీపీఐ శాసనసభా పక్ష మాజీ నేత గుండా మల్లేష్ మరణించిన విషయం తెలిసింది. దాంతో గుండా మల్లేష్ మరణం పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ. గుండా మల్లేష్ మరణం పట్ల ఆయన మాట్లాడుతూ… 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైన మల్లేష్ సిపిఐ శాసనసభాపక్ష నేతగా పని చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా, కార్మిక నాయకునిగా పలు బాధ్యతలు నిర్వర్తించారు అని తెలిపారు. గుండా మల్లేష్ మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని తెలిపారు. కామ్రేడ్ గూండా మల్లేష్ మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని, ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నాను” అని ప్రకటించారు. అయితే 1983లో ఆసిఫాబాద్ నుంచి సీపీఐ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందిన గుండా మల్లేష్ 1985, 1994 ఎన్నికల్లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు