ఐపీఎల్ 2020 లో ఈ రోజు మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్-చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచిన చెన్నై బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ బౌలర్ లు పవర్ ప్లే లోనే చెన్నై ఓపెనర్లను పెవిలియన్ కు పంపించేశారు. ఇక ఆ తర్వాత షేన్ వాట్సన్ (42), అంబటి రాయుడు(41) కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేసారు. కానీ ఈ ఇద్దరు బ్యాట్స్మెన్స్ వెనువెంటనే ఔట్ కావడంతో చెన్నై మళ్ళీ కష్టాలో పడింది. కానీ చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన రవీంద్ర జడేజా 10 బంతుల్లోనే 25 పరుగులు చేయడంతో చెన్నై నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్, టి నటరాజన్ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇక ఏ మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించాలంటే 168 పరుగులు చేయాలి. అయితే మరోసారి సన్‌రైజర్స్ ఓపెనర్లు ధీటుగా నిలబడటంటే జట్టుకు విజయం తప్పనిసరి. చూడాలి మరి ఈ మ్యాచ్ లో విజయం ఎవరు సాధిస్తారు అనేది.
previous post
కేసులు లేకుండా చంద్రబాబు ప్లాన్.. అందుకే బీజేపీలోకి పంపిస్తున్నారు: సి.రామచంద్రయ్య