telugu navyamedia
క్రీడలు వార్తలు

కీరన్‌ పొలార్డ్ మృతిచెందినట్టు అసత్య ప్రచారం…

వెస్టిండీస్ పరిమిత ఓవర్ల కెప్టెన్ కీరన్‌ పొలార్డ్ మృతిచెందినట్టు రెండు రోజుల క్రితం సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అబుదాబి టీ10 లీగ్‌లో ఆడేందుకు యూఏఈకి వచ్చిన పొలార్డ్‌కి కారు యాక్సిడెంట్ అయ్యిందని, సంఘటనా స్థలంలోనే అతను చనిపోయినట్లు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయి. రెండు కార్లు ఢీకొన్న ఫొటో, ఒక డెడ్ బాడీని అంబులెన్స్‌లోకి ఎక్కిస్తున్న ఫొటోని తమతమ ఛానళ్లలో చూపించాయి. దీంతో అభిమానులు ఆందోళకు గురయ్యారు. యూట్యూబ్ ఛానళ్లు వార్తలు ప్రసారం చేసిన న్యూస్ నెట్టింట వైరల్ అయింది. ట్విట్టర్, వైల్డ్ ఫైర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వార్తలు చూసిన కొందరు అభిమానులు విండీస్ స్టార్ ఆల్‌రౌండర్ పొలార్డ్ ఆత్మకి శాంతి కలగాలంటూ ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేశారు. అయితే అబుదాబి టీ10 లీగ్‌ ఆడడంతో పొలార్డ్‌‌కి ఎలాంటి ప్రమాదం జరగలేదని, అవన్నీ ఫేక్ న్యూస్ అని తాజాగా తేలిపోయింది. దాంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అబుదాబి టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్ టీమ్‌కి కీరన్ పొలార్డ్ నాయకత్వం వహిస్తున్నాడు. గురువారం, శుక్రవారం జరిగిన మ్యాచులలో పొలార్డ్ ఆడాడు.

పూణే డెవిల్స్ జట్టుతో జరిగిన మ్యాచులో కీరన్‌ పొలార్డ్ 6 బంతులు ఎదుర్కొని 2 రన్స్ చేశాడు. ఈ మ్యాచులో డెక్కన్ గ్లాడియేటర్స్ ఓడిపోయింది. ఇక శుక్రవారం టీమ్ అబుదాబితో జరిగిన మ్యాచులో పొలార్డ్ 17 బంతుల్లో 24 రన్స్ బాదాడు. ఓ భారీ సిక్సర్ కూడా బాదాడు. ఈ మ్యాచులో గ్లాడియేటర్స్ విజయాన్ని అందుకుంది. కరోనా వైరస్ ఆందోళనల కారణంగా పొలార్డ్ ఇటీవల ముగిసిన బంగ్లాదేశ్ పర్యటన నుంచి వైదొలిగాడు. బంగ్లాదేశ్ మూడు వన్డేల సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఫిబ్రవరి మూడు నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. కీరన్ పొలార్డ్ వెస్టిండీస్ తరఫున ఆడటం కంటే ప్రైవేట్ లీగ్స్‌లో ఆడేందుకు అధిక ప్రాధాన్యమిస్తున్నాడు. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అన్ని లీగ్స్‌లో దాదాపు ఆడుతున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్‌లో సుదీర్ఘకాలంగా ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఈ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2021 సీజన్ కోసం పొలార్డ్‌ని రూ 5.4 కోట్లకి ముంబై ఫ్రాంఛైజీ రిటైన్ చేసుకుంది. భారత్‌లోనే ఏప్రిల్-మే నెలలో ఐపీఎల్ 2021 సీజన్ మ్యాచ్‌లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్ ముగిసిన అనంతరం ఐపీఎల్ వేదికపై బీసీసీఐ నిర్ణయం తీసుకోనుంది.

Related posts