telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

రాజశేఖర్ కొత్త సినిమా పోస్టర్ విడుదల…

వైవిధ్యమైన కథలను ఎంచుకొని తన నటన విశ్వరూపాన్ని చూపించారు రాజశేఖర్. అయితే ప్రస్తుతం రాజశేఖర్ ఎమ్ఎల్‌వీ నిర్మాణంలో తన తాజా చిత్రం చేస్తున్నారు. ఈ సినిమాకు మొదట నీలకంఠ దర్శకత్వ బాధ్యతలు చేపట్టినా కొన్ని అనివార్య కారణాల వల్ల అతడు తప్పుకున్నాడు. ప్రస్తుతం మరో దర్శకుడి కోసం చిత్ర యూనిట్ వెతుకుతోంది. ఇదిలా ఉంటే ఈ రోజు రాజశేఖర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు శేఖర్ అనే పేరును ఫిక్స్ చేశారు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌లో రాజశేఖర్ సగం ముఖం కనిపిస్తుంది. ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతుంది. ఈ సినిమాలో రాజశేఖర్ రిటైర్ అయిన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం అతడి అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. అయితే రే ఎంట్రీ తర్వాత ఇప్పటివరకు రాజశేఖర్ చేసిన గరుడవేగా, కల్కి రెండు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు ఈ మూడు సినిమా అంచనాలు బాగానే ఉన్నాయి. చూడాలి మరి శేఖర్ ఆ చానళ్లను అందుకోగలడా… లేదా అనేది.

Related posts