telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

వచ్చే వారంలో రాధేశ్యామ్ టీజర్ రిలీజ్..?

Radheshyam

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరో ఎవరంటే అందరూ ప్రభాస్ పేరే చెప్తారు. అయితే బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ జాతీయ స్థాయి స్టార్‌గా ఎదిగారు. ఆ తరువాత వరుస భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ పూర్తి చేసిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే వారికి తీపి కబురు అందిందనే చెప్పాలి. వచ్చే వారంలో రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ అనౌన్స్‌మెంట్ చేయనున్నారంట. ఈ మేరకు వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న సినిమా కాబట్టి ఈ సినిమా టీజర్‌ను లవర్స్ డే రోజున విడుదల చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి లవర్స్ డే రోజున ప్రభాస్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తాడా… లేదా అనేది తెలియాలంటే మనం కూడా అప్పటి వరకు వేచి ఉండక తప్పదు.

Related posts