telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అదిరిపోయే సమాధానంతో అతని నోరు మూయించిన తాప్సి

Taapsee

తెలుగులో “ఝుమ్మంది నాదం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సొట్ట‌బుగ్గ‌ల సుంద‌రి తాప్సీ ఆ తరువాత బాలీవుడ్ లో అవకాశాలను చేజిక్కించుకుని స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. తాప్సి ఇప్పుడు గుజరాత్‌కు చెందిన రష్మీ అనే అథ్లెట్ పాత్రలో ఆమె కనిపించబోతున్నది. తాప్సీ ప్రధాన పాత్రలో “రష్మీ రాకెట్” పేరుతో ఓ బాలీవుడ్ చిత్రం తెరకెక్కుతున్నది. ఆకర్ష్ ఖురానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రోనీ స్క్య్రూవాలా నిర్మిస్తున్నారు. ఇటీవలే `పింక్`, `మిషన్ మంగళ్` వంటి హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. తాజాగా తాప్సీ… భూమీ పడ్నేకర్‌తో కలిసి నటించిన “సాండ్‌ కీ ఆంఖ్‌” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్, కోలీవుడ్‌, బాలీవుడ్‌లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న తాప్సి తాజాగా గోవాలో జ‌రుగుతున్న ఇంటర్నేష‌న‌ల్ ఫిలిం ఫెస్టివ‌ల్ ఆఫ్ ఇండియా వేడుక‌ల్లో పాల్గొన్నారు. అక్క‌డ పాత్రికేయుల‌తో మాట్లాడుతూ వారు అడుగుతున్న ప్ర‌శ్న‌ల‌కు ఇంగ్లీష్‌లో స‌మాధాన‌లిస్తుండ‌గా ఓ వ్య‌క్తి తాప్సీని హిందీలో మాట్లాడ‌మ‌న్నాడు. దానికి ఆమె ఇక్క‌డున్న వారిలో అంద‌రికీ హిందీలో స‌మాధానం చెబితే అర్థం కాదు కాబ‌ట్టి ఇంగ్లీష్‌లో మాట్లాడ‌టం లేద‌ని అన్నారు. దానికి ఆ వ్య‌క్తి మీరు హిందీ న‌టి క‌దా! హిందీలో ఎందుకు మాట్లాడ‌రు? అని ప్ర‌శ్నించాడు. దానికి తాప్సీ `నేను తెలుగు, త‌మిళ భాష‌ల్లో కూడా సినిమా కూడా సినిమాలు చేశాను. ఆ భాష‌ల‌ను మాట్లాడ‌గ‌ల‌ను. వాటిలో మాట్లాడ‌నా?` అని అన‌డంతో స‌ద‌రు వ్య‌క్తి నోరు మూసుకున్నాడు. తాప్సీ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Related posts