telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : అలీ, హిమజ రచ్చ… శ్రీముఖి వల్ల రవికి తీవ్రమైన గాయం

Bigg-Boss-3

బిగ్ బాస్ సీజ‌న్-3 ప్రారంభ‌మై 15 మంది కంటెస్టెంట్స్‌తో ఇప్ప‌టికే రెండు ఎలిమినేష‌న్స్ పూర్త‌య్యాయి. తొలి వారం హేమ ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ళ‌గా, రెండో వారం జాఫ‌ర్‌ని ఎలిమినేట్ చేశారు. ప్ర‌స్తుతం హౌజ్‌లో 14 మంది స‌భ్యులు ఉండ‌గా, కొంద‌రు గ్రూపుయిజం చేస్తున్నార‌ని దాని వ‌ల‌న ప‌ర్టిక్యుల‌ర్ ప‌ర్స‌న్స్‌ని ఎలిమినేట్ చేస్తున్నార‌ని వితికా, పున‌ర్న‌వి, వ‌రుణ్ సందేశ్ అనుకుంటున్నారు. సోమవారం జ‌రిగిన 16వ ఎపిసోడ్‌లో త‌మ‌న్నా.. ర‌విని టార్గెట్ చేసి రెచ్చిపోయింది. పున‌ర్న‌వి మ‌రోసారి నామినేట్ కావ‌డంతో ఎమోష‌న్‌ని కంట్రోల్ చేసుకోలేక ఫైర్ అయింది. ఇక ఈ వారం నామినేష‌న్‌లో ఎక్కువ ఓట్లు పొందిన తమన్నా, పునర్నవి, రాహుల్, వితికా, బాబా భాస్కర్‌లు ఎలిమినేషన్‌లో నిలిచారు. మూడోవారం కెప్టెన్ అయ్యేందుకు ఇంటి స‌భ్యుల‌కి బిగ్ బాస్ దొంగ‌లున్నారు జాగ్ర‌త్త అనే టాస్క్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ టాస్క్‌లో భాగంగా తికమకపురం ఊరి పెద్దగా వరుణ్‌ సందేశ్‌,తమన్నాలు ఉండ‌గా.. ఊరిలో ఓ జంటగా అలీ , పున‌ర్న‌వి.. అన్న‌ద‌మ్ములుగా రాహుల్ ,మ‌హేష్‌.. అక్క చెల్లెళ్లుగా రోహిణి, వితిక‌ పని కోసం ఎదురు చూసే లాయర్‌గా హిమజగా ఉన్నారు. బద్దకస్తుడైన పోలీస్‌ ఆఫీసర్‌ బాబా భాస్కర్‌.. స్ట్రిక్ట్‌ కానిస్టేబుల్‌గా శివజ్యోతి. ఇక దొంగలైన అషూ రెడ్డి, శ్రీముఖి, రవికృష్ణలు దొంగతనాలు చేస్తుండగా.. పోలీసులు వారిని పట్టుకుని జైల్లో వేస్తున్నారు.

ఈ క్రమంలో ఇంట్లో నీళ్లు తాగేందుకు వెళ్లిన హిమజను అలీ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె నిరాకరించింది. దీంతో రెండోసారి ఆమె జేబులో చేయిపెట్టి డబ్బులు లాక్కునే ప్రయత్నం చేయగా హిమజ అతడి ముఖంపై తన్నింది. దీంతో కోపంతో ఊగిపోయిన అలీ ఆమెపై దాడికి యత్నించాడు. లాగిపెట్టి కొడతానంటూ ఆమెపైకి వెళ్లాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. చివరికి హిమజ దిగొచ్చి అలీకి క్షమాపణ చెప్పింది. అయినప్పటికీ అలీ వెనక్కి తగ్గకపోవడంతో కాళ్లపై పడి క్షమాపణ చెప్పింది. సింపథీ కోసం కాళ్లపై పడొద్దని అలీ అనడంతో బాత్రూముకు వెళ్లి బోరున విలపించింది. హిమజకు అండగా వెళ్లిన తమన్నాపైనా అలీ ఎదురుదాడికి దిగడంతో గొడవ పెద్దదైంది. హిమ‌జ ప‌ర్స‌న‌ల్ లైఫ్ గురించి కూడా అలీ మాట‌లు అన‌డంతో శ్రీముఖి, త‌మ‌న్నా, అషూలు అలీదే త‌ప్పని చ‌ర్చ జ‌రిపారు. ఇంత‌లో హిమ‌జ నా ప‌ర్స‌న‌ల్ లైఫ్ అన్నావు, ఏం జ‌రిగిందో చెప్పు. నువ్వు ఏదో మాట్లాడితే అది జ‌నాల‌లోకి నెగెటివ్‌గా వెళుతుంద‌ని హిమ‌జ పేర్కొంది. కొద్ది సేపు డిస్క‌ష‌న్ జ‌రిగిన త‌ర్వాత హిమ‌జ, అలీ జ‌రిగిన విష‌యాన్ని చ‌ర్చించుకొని కూల్ అయ్యారు.

కెప్టెన్ టాస్క్‌లో దొంగ‌లుగా ఉన్న శ్రీముఖి, అషూ, ర‌విలు నిధిని దొంగిలించేందుకు అనేక ప‌థ‌కాలు వేశారు. ర‌వి, అషూలు కొద్ది సేపు జైలులో ఉండ‌డంతో శ్రీముఖి మొత్తం బాధ్య‌త‌ని తీసుకొంది. వ‌రుణ్‌ని మాట‌ల‌లో పెట్టి ట్రంక్ పెట్టె ద‌గ్గ‌ర‌కి తీసుకొచ్చి ఆయ‌న జేబులో ఉన్న డ‌బ్బుని బాక్స్‌లో వేసింది. దీంతో ఆమె సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. ఇక పోలీసుల‌కి కొద్ది పాటి లంచం ఇచ్చి అషూ బ‌య‌ట‌కి వ‌చ్చింది. ఇద్ద‌రు క‌లిసి నిధిని దొంగిలించేందుకు ప‌లు ప‌థ‌కాలు వేశారు. ప‌ర్స‌న‌ల్ ఎటాక్ చేస్తే నిధి ద‌క్కుతుంద‌ని మ‌హేష్ స‌ల‌హా ఇవ్వ‌డంతో ర‌విని బ‌య‌ట‌కి తీసుకొచ్చి శ్రీముఖి, అషూలు నిధి అద్దాల‌ని ప‌గ‌ల‌గొట్టాల‌ని డిసైడ్ అయ్యారు. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం డంబెల్‌తో నిది ద‌గ్గ‌ర‌కి వెళ్లిన శ్రీ ముఖి… నిధి చుట్టు వరుణ్, వితికా, తమన్నా, మహేష్‌లు కాపలా ఉన్నా ధైర్యం చేసి డంబెల్‌తో నిధి అద్దాలను పగలగొట్టింది. రవిని సైతం పగలగొట్టమమని శ్రీముఖి సలహా ఇస్తూ డంబెల్ అతని చేతికి అందివ్వడానికి ప్రయత్నించగా… అది అందుకోవడం రవికి కుదరక చేతితో అద్దాలను పగలగొట్టాడు. దీంతో అతని చేతికి బ‌ల‌మైన గాయం కావ‌డంతో పాటు రక్తం ధార‌ళంగా పారింది. వెంట‌నే అత‌నిని మెడిక‌ల్ రూంలోకి తీసుకెళ్లి చికిత్స అందించారు వైద్యులు. శ్రీముఖి త‌ప్పుడు ఆలోచ‌న‌తోనే ర‌వికి గాయ‌మైంద‌ని వితికా, రాహుల్‌లు ఆమెపై ఫైర్ అయ్యారు. రోహిణి … శ్రీముఖికి స‌పోర్ట్ చేసి మాట్లాడుతున్న‌ప్ప‌టికి త‌ప్పంతా శ్రీముఖిదే అని వారు గ‌ట్టిగా వాదించారు. నిధికి సంబంధించిన విలువైన వ‌స్తువుల‌న్ని వ‌రుణ్ సోఫాలో ప‌డేశాడు. అవ‌న్ని ర‌వి కృష్ణ‌కే ఇవ్వాల‌ని కొంద‌రు అన్నారు. మ‌రి ఇంత‌లోనే ఎపిసోడ్ 18కి ఎండ్ కార్డ్ ప‌డ‌డంతో కెప్టెన్ ఎవ‌రు అవుతారు అనే దానిపై ఇంకా స‌స్పెన్స్ నెల‌కొని ఉంది. ఈరోజు ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌజ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

Related posts