పూర్వ ఎంపి, సినీ నటి జయప్రదకు ఉత్తరప్రదేశ్ ప్రజా ప్రతినిధుల కోర్టు నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసింది. వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని రామ్ పూర్ ఎస్పీ ని ఆదేశించింది.
ఇప్పటికే చెన్నై థియేటర్ కు సంబంధించిన ఇఎస్ఐ కేసులో ఆమెకు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ కేసులో ఆమె సుప్రీం కోర్టు కు వెల్లి స్టే తెచ్చుకున్నారు. 2019 ఎన్నికల్లో ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన్నట్లు రామ్ పూర్ లోని కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్ల లో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణ ఇవాళ ప్రజా ప్రతినిధుల కోర్టు లో జరిగినప్పుడు ఆమె గైర్హాజరు అయ్యారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినా ఆమె స్పందించలేదు.
ఇప్పటివరకు ఏడు సార్లు వారెంట్ జారీ చేసినా ఆమెను పోలీసులు అరెస్ట్ చేయలేదని న్యాయవాది అభ్యంతరం చెప్పడంతో న్యాయమూర్తి పోలీసులపై సీరియస్ అయ్యారు. వెంటనే నాన్ బెయిల్ వారెంట్ జారీ చేసి జయప్రదను అరెస్ట్ చేసి కోర్టు కు తీసుకురావాలని ఆదేశించారు. విచారణను ఈ నెల 27వ తేదికి వాయిదా వేశారు.