తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు.బెంగాల్‌లోని తమలూక్‌లో జరిగిన బహిరంగసభలో మోదీ మాట్లాడుతూ.. ఫని తుఫాన్ విషయంలోనూ స్పీడ్ బ్రేకర్ మమత రాజకీయాలు చేసిందన్నారు. దీదీతో మాట్లాడేందుకు ట్రై చేశాను, తనతో మాట్లాడేందుకు ఆమె నిరాకరించిందని మోదీ అన్నారు.
ఆమెకు ఎంత అహంకారం ఉందంటే, మళ్లీ మళ్లీ ప్రయత్నించినా, దీదీ మాట్లాడలేదన్నారు. మమతా బెనర్జీ ఇటీవల చీటికిమాటికి విసుగుచెందుతోందన్నారు. దేవుళ్ల గురించి మాట్లాడితే సహనం కోల్పూతునరాని అన్నారు. జై శ్రీరాం అని నినాదాలు చేసేవారిని కూడా అరెస్టు చేస్తోందని మోదీ ఆరోపించారు.
తెలంగాణలో నడ్డా మాటలు కార్యరూపం దాల్చలేదు: పొన్నం ప్రభాకర్