telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

గోధుమ రవ్వతో బ్రేక్ ఫాస్ట్ చేసుకుంటే.. అన్ని రోగాలు మటాష్ !

గోధుమ రవ్వ మనకు నిత్యం వంటింట్లో కనిపించే ఐటం. అయితే.. ఈ గోధుమ రవ్వ వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గోధుమల ద్వారా తీసిన ఈ రవ్వ వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, శరీర బరువు తగ్గించుటలోనూ దోహదపడుతుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్‌, విటమిన్‌-బి ఉంటాయి. గోధుమ రవ్వలో శరీర బరువు తగ్గేందుకు పోషకాలతో పాటు తక్కువ క్యాలరీలు ఉంటాయి. కావున గోధుమరవ్వను డైట్లో చేర్చుకుంటే.. తర్వగా బరువు తగ్గవచ్చు.

గోధుమరవ్వతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
శరీర బరువు తగ్గించడానికి గోధుమ రవ్వ ఉపయోగపడుతుంది. దీంట్లో తక్కు కేలరీలు ఉంటాయి.
గోధుమ రవ్వలో ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్థులు గోధుమరవ్వతో తయారు చేసిన ఉప్మా తీసుకుంటే.. చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు.
గోధుమ రవ్వలో ఉండే ఫాస్పరస్‌, జింక్‌, మెగ్నీషియం శరీరంలోని నరాల వ్యవస్థకు మేలు చేస్తుంది.

Related posts