telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం కేసీఆర్…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం దేశ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఆయన మొదట కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమైన కేసీఆర్.. దాదాపు గంటపాటు చర్చలు జరిపారు.. రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులు, కేంద్ర సహకారంపై ప్రముఖంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది.. తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు తెలిపారు కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నిత్యం 3 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు అనుమతి ఇవ్వాలని  కోరారు. షెకావత్‌తో సమావేశం ముగిసిన తర్వాత.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిశారు కేసీఆర్.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ విభాగం ఉండడంతో.. హైదరాబాద్ నగరంలో వరద నష్టానికి ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులతో.. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది.. ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకున్నారు.. గ్రేటర్ ప్రచారానికి వచ్చిన అమిత్‌షా కూడా.. తెలంగాణ సర్కార్‌ను టార్గెట్ చేశారు.. ఆ వెంటనే ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. షాతో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. మూడు రోజుల ఢిల్లీ పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన కేసీఆర్.. ఆదివారం వరకు హస్తినలోనే మకాం వేయనున్నారు

Related posts