telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

తిరుమల భక్తులకు శుభవార్త… ఇక పై వారికీ కూడా అనుమతి

ttd plans to venkanna temples in mumbai and j & K

కరోనా కారణంగా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనభాగ్యానికి దూరమయ్యారు భక్తులు.. ఆ తర్వాత వచ్చిన సడలింపులతో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు.. అయితే, పదేళ్ల లోపు పిల్లలకు, 65 ఏళ్ల పైబడిన వృద్ధులను మాత్రం అనుమతించలేదు.. కానీ, ఇప్పుడు కేసులు తగ్గుముఖం పడుతుండడంతో… భక్తులకు శుభవార్త చెప్పింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది… ఇకపై పదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు సైతం దర్శనానికి అనుమతించేందుకు సిద్ధమైంది.. భక్తుల మనోభావాలు, ఆచారాలను దృష్టిలో ఉంచుకొని అందరికీ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ పేర్కొంది. అయితే, కరోనాకు ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉండదు… భక్తులు స్వీయ నియంత్రణ, జాగ్రత్తలతో దర్శనం చేసుకోవాలని సూచనలు చేసింది టీటీడీ. ఇదే సమయంలో.. పిల్లలు, వృద్ధుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. మరోవైపు.. టీటీడీ ఆన్‌లైన్‌లో ఉంచిన వైకుంఠ ద్వారా దర్శనం టికెట్లు తక్కువ సమయంలోనే అమ్ముడు పోయాయి.. డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు వైకుంఠ ద్వారం నుంచి శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను  ఉదయం 6.30 గంటల నుంచి వెబ్‌సైట్‌లో పెట్టింది టీటీడీ.

Related posts