telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై జగన్‌ కు మోదీ ఫోన్

jagan modi

విశాఖపట్నంలోని ఆర్‌ఆర్‌ వెంకటాపురంలో ఓ పరిశ్రమ నుంచి గ్యాస్‌ లీకైన ఘటనపై ఏపీ సీఎం జగన్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోనులో మాట్లాడారు. అక్కడి పరిస్థితులపై మోదీ పూర్తి సమాచారం అడిగి తెలుసుకున్నారు. పూర్తి సాయం అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఆయన హోం శాఖతో పాటు జాతీయ విపత్తు నిర్వహణ అధికారులతో మాట్లాడి పరిస్థితులను సమీక్షించారు.

గ్యాస్‌ లీకేజీ ఘటనపై ప్రధాని మోదీ ట్విటర్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకునేలా వెంటనే సహాయ చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశించినట్లు ప్రధాని పేర్కొన్నారు. పరిస్థితిని ఎప్పటికప్పడు సమీక్షిస్తున్నామన్నారు. గ్యాస్‌ లీకేజీ ఘటనలో అస్వస్థకు గురైన వారు వెంటనే కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్‌ చేశారు. 

.గ్యాస్‌ లీక్‌ జరిగిన ప్రాంతంలో రంగంలోకి దిగిన మునిసిపల్ సిబ్బంది.. ప్రమాద తీవ్రత తగ్గించేందుకు రసాయనాలు పిచికారీ చేస్తున్నారు. ఘటనాస్థలికి పరిశ్రమ నిపుణులను అధికారులు రప్పించారు. ప్రభావిత గ్రామాల్లో మంత్రి అవంతి శ్రీనివాస్‌, కలెక్టర్ వినయ్ చంద్ పర్యటిస్తున్నారు.

Related posts