కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజలు భగ్గుమంటున్నారు. ఈ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తాజాగా సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
పౌరసత్వ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని అసద్ ఆరోపించారు. పౌరసత్వ చట్ట సవరణపై సుప్రీంను ఆశ్రయించిన వారిలో కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, న్యాయవాది ఎంఎల్ శర్మ, ఆల్ అస్సామ్ స్టూడెంట్స్ యూనియన్ కూడా ఉన్నాయి.