telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

కన్నీరు కారిన… ఆనంద భాష్పాలు వర్షించినా

నిత్యం అక్షర సేద్యం చేస్తున్నా
బంగారు పంటలు పండించాలని కాదు
అక్షరాలను జ్ఞాపకంగా దాచుకోవాలని
పుడమి పైన వసంతాలు పూయించాలని…!!
కలలు కంటూ ఉన్న
గత తాలూకా అనుభవాలకు
సుగంధ పరిమళాలను అద్ది
అందరి హృదయాలకు వ్యాపించాయని…!!
కన్నీరు కారిన
ఆనంద భాష్పాలు వర్షించిన
ప్రతిదీ పంచుకునేందుకు
అక్షరాలను తోడుగా చెసుకొని సాగుతున్నా…!!
ఉప్పొంగే ఉపద్రవాలను
కరుణించే శాంతి మంత్రాలను
మనసులోని బంధించు కొని
భావాల రూపంలో బయటికి తోడు కుంటున్నాను…
ఆశ నిరాశల మధ్య
కానరాని చీకట్లో
కాంతి కోసం వెతుకుతున్నాను
అక్షర వెలుగునీడల్లో సేదతీరాలని…!!
అస్తవ్యస్త గమ్యం లో
ఆకలి తో పోరాటంలో
ఊట బావులు దూరమవుతున్న
అక్షర దాహంతో తీరడం లేదు …!!
అక్షరం ధైర్యం మై నడిపిస్తున్న
బ్రతుకు బాటలో ఓడుతున్న
కష్టాలు కవ్విస్తున్న
కన్నీటితో కవిత్వాన్ని రాస్తాను…!!

Related posts