telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

వారపత్రిక అధినేత పై దాడి.. వైసీపీ ఎమ్మెల్యేతో సహా ఆరుగురిపై కేసు

ycp party

ఓ వార పత్రిక క అధినేత పై దాడి చేసిన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సహా ఆరుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదివారం రాత్రి జమీన్ రైతు వారపత్రిక అధినేత డోలేంద్ర ప్రసాద్‌ మీద దాడి చేసిన ఘటనపై కేసు నమోదయింది. కాగా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి తీరుపై టీడీపీ, బీజేపీ, సీపీఎం పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీడియాపై దాడులకు నిరసనగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాయి. కోటంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని జర్నలిస్ట్ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. కాగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలు కోటంరెడ్డిపై సీఎం జగన్‌కు ఫిర్యాదు చేశారు.

మరో వైపు నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే, వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తనపై దాడిచేసి కొట్టారని “జమీన్‌ రైతు” వారపత్రిక ఎడిటర్‌ డోలేంద్ర ప్రసాద్‌ తెలిపారు. నెల్లూరులో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏరా నేను అరాచక శక్తినంటూ.. నాపై అరపేజీ వార్త రాస్తావా? ఇక్కడికిక్కడే నిన్ను చంపేస్తా.. మూడు పేజీల వార్త రాసుకో అంటూ బెదిరించారని తెలిపారు.

Related posts