అవినీతికి తావులేకుండా కఠినమైన మున్సిపాలిటీ చట్టం తీసుకొచ్చామని తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. మంత్రి కేటీఆర్ సారథ్యంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా టీఆర్‌ఎస్‌దే విజయమని మంత్రి శ్రీఅన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. కరివేనను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, జడ్చర్లను కలుపుకొని అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని వివరించారు. గత 70ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీలు చేసిందేమీ లేదని ఆరోపించారు.
రాజధానిలో రియల్ రంగం పడిపోయింది: చంద్రబాబు