telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి…

NBK

ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఈ మూడో సినిమాలో ఓ కీలకమైన పాత్రకు బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టిని ఎంపిక చేశారు. ఇంకా పేరు పక్కా కానీ ఈ మూవీలో సీనియర్ బాలకృష్ణతో తలపడే ప్రతినాయకుడిగా సునీల్ శెట్టి నటింబోతున్నాడు. వీరిద్ధరి మధ్య రోమాంచితమైన యాక్షన్ ఎపిసోడ్ ను బోయపాటి ప్లాన్ చేశాడని సమాచారం. నటుడిగా మూడు దశాబ్దాల అనుభవం ఉన్న సునీల్ శెట్టి ఇరవై యేళ్ళ క్రితమే తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టాడు. అలానే పలు మలయాళ చిత్రాల్లోనూ గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చాడు. కానీ ఈ యేడాది ఒకేసారి ఏకంగా మూడు తెలుగు చిత్రాల్లో సునీల్ శెట్టి నటిస్తుండటం విశేషం. అతని తొలి తెలుగు చిత్రం ‘మోసగాళ్ళు మార్చి 19న రాబోతుండగా; బాలకృష్ణ, బోయపాటి సినిమా మే 28న; ‘గని’ మూవీ జూలై 30న రాబోతున్నాయి. మరి ఈ మూడు సినిమాలు సునీల్ శెట్టికి తెలుగులో ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు..ఈ సినిమాకు ఎంత ఉపయోగపడుతాడు అనేది చూడాలి.

Related posts