telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

దాడులతో పాక్ ను సవాలు చేయడం భారత్ కు మంచిది కాదు: పాక్ మంత్రి

పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారకంగా భారత వాయుసేన మంగళవారం చేసిన మెరుపు దాడులను పాక్ ప్రభుత్వం దృవీకరించింది. ఈ దాడుల్లో సుమారు 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. మరోవైపు భారత్ చేస్తున్న సర్జికల్‌ స్ట్రైక్‌ బయటకు పొక్కకుండా పాక్ ప్రయత్నిస్తోంది.

ఈ నేపథ్యంలో పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషి సంచలన వ్యాఖ్యలు చేశారు.దాడులతో పాక్ ను సవాలు చేయడం భారత్ కు మంచిది కాదని హితవు పలికారు. ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల పాక్ ఏమీ బెదిరిపోలేదన్నారు. దురదృష్టవశాత్తూ భారత్ మరిన్ని దాడులకు పాల్పడితే.. వాటిని ఎదుర్కొనేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు. అన్నింటినీ దేవుడు చూసుకుంటాడని, శాంతిని కోరుకునే దేశం తమదని ఖురేషి వెల్లడించారు. తాము ఉగ్రవాదంపై విజయవంతంగా పోరాటం చేస్తున్నామని అభిప్రాయపడ్డారు.

Related posts