telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

అది చూపిస్తూ సర్జరీ…

మాములుగా మెదడుకు సర్జరీ చేస్తున్న సమయంలో ఆ రోగి మెలకువగా ఉండాలి.. డాక్టర్లు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలి. దీంతో ఆపరేషన్ సక్సెస్‌ చేయాలనుకున్న గుంటూరులోని డాక్టర్లు పేషెంట్‌కు బిగ్‌బాస్‌ షోను, అవతార్‌ సినిమాను చూపిస్తూ విజయవంతంగా సర్జరీని పూర్తి చేసి శభాష్ అనిపించుకున్నారు.  గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్‌కు బ్రెయిన్‌ ట్యూమర్‌ ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. 2016లో హైదరాబాద్‌లోనే సర్జరీ చేసి కణితిని తొలగించి.. రేడియేషన్‌ ఇచ్చారు. మళ్లీ కొన్ని నెలల నుంచి ఆయనకు తరచుగా ఫిట్స్‌ వస్తున్నాయి.. దీంతో కుటుంబ సభ్యులు కంగారుపడ్డారు. వెంటనే గుంటూరు లోని ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా మెదడులో కణితి మళ్లీ పెరిగినట్లు గుర్తించారు. సర్జరీ చేసి తొలగించాలని నిర్ణయించారు. డాక్టర్లు మెదడు త్రీడీ మ్యాప్‌ను తయారు చేసుకుని.. నావిగేషన్‌ సాయంతో కణితి ఎక్కడ ఉందో గుర్తించారు. మెదడులో కీలకమైన ప్రాంతం కావడంతో జాగ్రత్తగా సర్జరీ చేశారు. పేషెంట్ స్పృహలో ఉండగానే మాట్లాడుతుండగానే మెదడులో మార్పులు, పరిణామాలను గమనిస్తూ సర్జరీ చేశారు. అతడు మెలుకువగా ఉండటం కోసం బిగ్‌బాస్ షో, అవతార్ సినిమా చూపించారు. రోగికి పైసా ఖర్చు లేకుండా బీమా సౌకర్యం తో ఈ సర్జరీ నిర్వహించారు. రోగి పూర్తిగా కోలుకోవడంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ గ మారింది.

Related posts