telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

షాకింగ్… సుశాంత్ ది ఆత్మహత్య కాదు… వీడియో విడుదల చేసిన డాక్టర్

Sushanth

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ది ఆత్మహత్య కాదని, కచ్చితంగా హత్యేనని మాజీ కేంద్రమంత్రి సుబ్రమణియన్ స్వామితోపాటు పలువురు సెలబ్రిటీలు ఇప్పటికే ఆరోపించారు. ఆ వాదనను సమర్థిస్తూ తాజాగా ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. సుశాంత్ మరణానికి ఆత్మహత్య కారణం కాదని చెబుతున్న ఓ వీడియోను ప్రముఖ డెర్మటాలజిస్ట్ డా.మీనాక్షి మిశ్రా తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. సుశాంత్ ముఖంపై, ఇతర ప్రదేశాల్లో గాయాల గురించి ఆ వీడియోలో వివరించారు. అలాగే ఉరి వేసుకున్నపుడు బాధితుడి శరీరంపై జరిగే మార్పులను గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. ఈ ట్వీట్‌ను సుబ్రమణియన్ స్వామి రీ-ట్వీట్ చేశారు.

Related posts