telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

పొట్లకాయతో గుండె బలం !

పొట్లకాయ…మన దేశమంతా సాగు చేస్తున్న దేశీజాతి తీగ కూరగాయ. దీని కాయలు చూడటానికి పాములా ఉంటాయి. అందుకే దీనిని ఇంగ్లీష్‌లో స్నేక్‌ గార్డ్‌ అంటారు. పొట్లకాయ కూరను ఎక్కువ మంది ఇష్టపడతారు. అయితే.. ఈ పొట్లకాయ వలన అనేక లాభాలున్నాయి. దీని వల్ల డయాబెటిస్‌ వ్యాధి గ్రస్థులకు పొట్లకాయ ఎంతో మేలు చేస్తుంది. ఒబిసిటీతో బాధపడేవారు పొట్లకాయను తీసుకోవచ్చు. బరువుపెరగకుండా ఉండాలంటే డైట్‌లో పొట్లకాయను తీసుకోవాలి. జ్వరంతో బాధపడేవారు పొట్లకాయను ఉడికించిన నీటిని తీసుకుంటే.. ఒకే రాత్రిలో జ్వరం పరార్‌ అవుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడవు. జ్వరం తగ్గాలంటే పొట్లకాయను తీసుకుంటూ ఉండాలి. అంతేకాకుండా గుండెకు పొట్లకాయ బలాన్ని ఇస్తుంది. అధిక శ్రమతో ఏర్పడే మానసిక రుగ్మతలు, ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే పొట్లకాయను తినాలి. అధిక వేగంతో గుండె కొట్టుకోవడం.. శ్వాసక్రియ మెరుగ్గా పనిచేయాలంటే… పొట్లకాయను ఆహారంలో భాగం చేసుకోవాలి. అధిక నీటి శాతం కలిగి ఉన్న ఈ కూరగాయను తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను క్రమబద్దీకరించవచ్చు. ఇందులోని ధాతువులు, విటమిన్లు, కెరోటిన్లు, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చుండ్రును తొలగిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Related posts