telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీ విద్యార్థులు జగన్‌ సర్కార్‌ శుభవార్త…

ఏపీ విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. జగనన్న విద్యా కానుక పథకంపై ఈ మేరకు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే అకడెమిక్ ఇయర్ నుంచి జగనన్న విద్యా కానుక పథకం కింద ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యార్ధి కిట్ల పంపిణీకి పాలనానుమతి జారీ చేసింది ప్రభుత్వం. 2021-22 విద్యా సంవత్సరంలో 730 కోట్ల వ్యయంతో విద్యార్ధులకు మూడు జతల యూనిఫాం, పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు అందిచాల్సిందిగా పాఠశాల విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. జగనన్న విద్యా కానుక పథకంలో భాగంగా ఈసారి విద్యార్ధులకు ఇచ్చే కిట్లలో ఒక డిక్షనరీ కూడా అందించాలని ఆదేశించింది. 1-10 తరగతి వరకూ ప్రభుత్వ, మండల పరిషత్, పురపాలక, రెసిడెన్షియల్, ఆశ్రమ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్ధులందరికీ జగనన్న విద్యా కానుక కిట్లను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకం అమలు కోసం రూ. 500.62 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వం, రూ. 230.68 కోట్లను కేంద్ర ప్రభుత్వం భరిస్తాయని ఉత్తర్వుల్లో పేర్కోంది ప్రభుత్వం. 2021-22 విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరిచిన వెంటనే విద్యార్ధులకు ఈ కిట్లను పంపిణీ చేయాల్సిందిగా సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్లను ఆదేశించింది ప్రభుత్వం.

Related posts