telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దేత్తడి హారిక నియామకంపై మరోసారి మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ శ్రీనివాస్ నేరుగా దేత్తడి హారికను టూరిజం బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై వివాదం రాజుకుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రికి, ఉన్నతాధికారులకు తెలియకుండా ఈ నియామకం జరిగనట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పర్యాటక మంత్రితో పాటు ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.  టూరిజం మంత్రికి తెలియకుండానే ఈ నియామకం జరిగిందని ఇప్పటికే మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు. తాజాగా దేత్తడి హారిక నియామకంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి స్పందించారు. శ్రీనివాస్ గుప్తా…కొత్తగా చైర్మన్ అయాడని, నియామకం తెలియక చేసాడని ఆయన పేర్కొన్నారు. ఏం జరిగింది, ఎలా అపాయింట్ చేశారో తనకు తెలియదని తెలిపారు. ఈ విషయంపై కూర్చోని మాట్లాడుకోని, ఇబ్బంది లేకుండా సరిచేసుకుంటామని వెల్లడించారు. శ్రీనివాస్ గుప్తాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కమిటీ వేసి, అందరూ ఓకే అనుకుంటే హారికను కొనసాగిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. 

Related posts