telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కాజల్ కు ఆడపడుచు శుభాకాంక్షలు… పిక్ వైరల్

Kajal

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు మంగళవారం సోషల్‌మీడియా ద్వారా ఆమె స్వయంగా ప్రకటించింది. తన స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన గౌతమ్ కిచ్లును ఈ నెల 30వ తేదీన వివాహం చేసుకోబోతోంది. దీంతో కాజల్ కు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందులో ఓ స్పెషల్ శుభాకాంక్షల సందేశం కూడా ఉంది. కాజల్ కు కాబోయే భర్త గౌతమ్ కిచ్లు సోదరి గౌరు కుచ్లు నాయర్ కాజల్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. ఈ శుభాకాంక్షల సందేశంతో పాటు కాబోయే వధూవరులు కాజల్-గౌతమ్ లతో దిగిన ఫోటోను షేర్ చేశారు. దీంతో పాటు ”ప్రేమతో అభినందనలు” అంటూ పోస్ట్ పెట్టారు. ఇన్స్టాలో ఆమె పెట్టిన పోస్ట్ కు కాజల్ వెంటనే ‘ధన్యవాదములు.. సిస్టర్” అంటూ సమాధానం ఇచ్చారు. అంతేకాదు గౌరీ పంపిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టొరీ గా కాజల్ పెట్టుకున్నారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. కాజల్ ఈ ఫోటోలో తన కాబోయే భర్త గౌతమ్, ఆడపడుచు గౌరీల మధ్య కూచుని ఉన్నారు. కాగా కాజల్ బ్యాచిలరేట్‌ పార్టీకి సంబంధించిన కొన్ని ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి. సెప్టెంబర్‌ నెలాఖరున కాజల్‌ నివాసంలో జరిగిన ఈ పార్టీలో ఆమె కుటుంబసభ్యులు, గౌతమ్‌ కిచ్లు సోదరితోపాటు అతి తక్కువమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ఆమె బ్లాక్‌ కలర్‌ డ్రెస్‌ ధరించి.. ‘బ్రైడ్‌ టు బి’ క్యాప్షన్‌తో నవ్వుతూ ఫొటోలకు పోజులిచ్చారు.

Related posts