telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ మహిళకు 350పైగా నకిలీ ఇన్‌స్టాగ్రాం ఖాతాలు… ఏం చేసిందంటే ?

Arrest

ఫ్లోరిడాలోని హాలిడే ప్రాంతానికి చెందిన టామీ మేరీ స్టెఫెన్ అనే మహిళ 2016, ఆగస్టు నుంచి 2018, జూలై వరకు ఏకంగా 369 ఇన్‌స్టాగ్రాం ఖాతాలు, 18 ఈ-మెయిల్స్‌ను క్రియేట్ చేసింది. అనంతరం వాటి ద్వారా తన మాజీ ఆరుగురు సహరులకు మెయిల్స్, సందేశాలు పంపిస్తూ తీవ్రంగా వేధించడంతో పాటు బెదిరింపులకు పాల్పడింది. అలాగే ఫోన్ నెంబర్లు మారుస్తూ మెసేజ్‌లు, కాల్స్ చేసి వారిని భయపెట్టేది. అంతేగాక తన గొంతును బాధితులు గుర్తుపట్టకుండా ఉండేందుకు వాయిస్-డిస్‌గైసింగ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఫోన్ కాల్స్ చేసేది. స్టెఫెన్ బాధితులకు పంపిన సందేశాల్లో కొన్ని… “నిన్ను చిన్న చిన్న ముక్కలుగా నరికేస్తా’, ‘నీవు ఇంతకు ముందెన్నడూ చూడని నరకాన్ని చూపిస్తా” అనే భయంకర మెసేజ్‌లు, రెండు కత్తులు పట్టుకున్న మహిళ ఫొటోను బాధితులకు పంపించేది. ఫొటోకు ‘నేను వస్తున్నాను’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చేది. ఇలా రెండేళ్ల పాటు ఆరుగురు మాజీ సహచరులను స్టెఫెన్ భయంకరమైన సందేశాలతో వేధించింది. ఆమె వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో చివరకు బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన సైబర్‌క్రైం పోలీసులు డిసెంబర్, 2018లో ఆమెను అరెస్ట్ చేశారు. తాజాగా స్టెఫెన్‌కు నాలుగేళ్ల తొమ్మిది నెలల జైలు శిక్ష పడింది.

Related posts