telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

ఎస్బీఐ ఖాతాదారుల .. సమాచారం హ్యాక్ .. సరిగా స్పందించని సంస్థ..

sbi accounts hacked but no answer

ఎస్బీఐ అంటేనే నమ్మకానికి గుర్తుగా భావించే సంస్థ; అందుకే దేశంలోనే అతి పెద్ద బ్యాంకుగా అవతరించింది. అలాంటి బ్యాంకు ఖాతాదారుల సమాచారం హ్యాక్ అయ్యింది. ఒక్కరిది కాదు, ఇద్దరిది కాదు. లక్షలాది మంది యూజర్ల అకౌంట్ల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలు లీకయ్యాయన్న వార్తలు SBI ఖాతాదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో డేటా లీక్ వ్యవహారంపై SBI స్పందించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది.

ముంబైలోని సర్వర్ దాదాపు రెండు నెలల పాటు ఎటువంటి పాస్‌వర్డ్ సెక్యూరిటీ లేకుండా వదిలేయడంతో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని యాక్సిస్ చేశారు. మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాంకు బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ వంటి వివరాలను వెల్లడించే ‘ఎస్బీఐ క్విక్’ సర్వర్ నుంచి ఈ డేటా లీక్ జరిగిందని చెప్పింది. బ్యాంకు తమ కస్టమర్లకు పంపే మెసేజెస్ కూడా లీక్ అయ్యాయని తెలిపింది. సోమవారం ఒక్క రోజే బ్యాంకు 30 లక్షల మందికి మెసేజెస్ పంపిందన్నారు. తాము కూడా సర్వర్ ను యాక్సిస్ చేశామని, అయితే ప్రస్తుతం సర్వర్ సేఫ్ గానే ఉందని టెక్ క్రంచ్ వివరించింది.

అయితే ఇప్పటికే లీక్ అయిన డేటా ఆధారంగా భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను టార్గెట్ చేసి దోచుకునే అవకాశం ఉందని టెక్నికల్ రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.మీకు ఎవరైనా కాల్ చేసి మీ అకౌంట్ నంబర్లు, బ్యాలెన్స్ లాంటి ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్పకూడదని అని హెచ్చరిస్తున్నారు.అలాగే నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డుల పాస్ వర్డ్, పిన్ నంబర్లను మార్చేసుకోవడం మేలు అని టెక్నికల్ రీసెర్చర్లు చెబుతున్నారు.

Related posts