telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

శ్రియ హాట్ డ్యాన్స్ వీడియో వైరల్… బార్సిలోనాలో మ‌రో రెయినీ డే…!

Shriya

2001లో ‘”ఇష్టం” సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్రియ శరణ్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా హవా కొనసాగించింది. 18 ఏళ్లుగా స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తున్న ఈ బ్యూటీ 2018లో ఆండ్రీ కొశ్చెవ్‌ని రాజ‌స్థాన్‌లో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. పెళ్ళి త‌ర్వాత సినిమాల‌ని పూర్తిగా త‌గ్గించేసింది. చివ‌రిగా “గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి” చిత్రంతో ప‌ల‌క‌రించిన ఈ అమ్మ‌డు ఇప్పుడు ప‌లు త‌మిళ సినిమాల‌తో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం హిందీలో “తడ్కా” , తమిళంలో “నరగాసురన్”, “సండకారి” సినిమాలలో నటిస్తోంది. అయితే శ్రియ సోష‌ల్ మీడియాను శ్రియా బాగానే ఉప‌యోగించుకుంటుంది. గ్లామ‌ర్ ఫొటోల‌ను, వీడియోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ కుర్ర‌కారును, అభిమానులను ఆక‌ట్టుకుంటోంది. 36 ఏళ్ళ వ‌య‌స్సులోను శ్రియ యూత్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. ప్ర‌స్తుతం స్పెయిన్‌లో ఉన్న ఈ అమ్మ‌డు ఇటీవ‌ల త‌న భ‌ర్త ఆండ్రీతో క‌లిసి ఐబిజా బీచ్ కు వెళ్లింది. అక్క‌డ స్పెప్పులు వేసిన వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇక తాజాగా త‌ను ఉన్న హోట‌ల్ బాల్కనీలో నైట్ డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేసిన వీడియోని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. “బార్సిలోనాలో మ‌రో రెయినీ డే” అంటూ ఆ వీడియోకి కామెంట్ పెట్టింది. ఈ వీడియో సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది. దాదాపు 2 ఏళ్ళ త‌ర్వాత కోలీవుడ్‌లో సండ‌కారి అనే సినిమా చేస్తుంది శ్రియ‌. విమ‌ల్ లీడ్ రోల్ పోషిస్తున్నాడు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్‌ని ఇటీవ‌ల‌ విడుద‌ల చేసిన విషయం తెలిసిందే.

 

View this post on Instagram

 

Just another rainy day in Barcelona

A post shared by @ shriya_saran1109 on

Related posts