నాని, విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం “గ్యాంగ్ లీడర్”. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ చెరుకూరి (సి.వి.ఎం) నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 13న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రియాంక, లక్ష్మి, శరణ్య, అనీష్ కురువిళ్లా, ప్రియదర్శి, రఘుబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఐదుగురు మహిళలకు నాని లీడర్‌గా, స్టోరీ రైటర్‌గా కనిపించబోతున్నాడు. ఇటీవల రిలీజైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇది ఒక రివేంజ్ డ్రామా అని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. మరోసారి విక్రమ్ కే కుమార్ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సిద్ధమైపోయాడు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచంద్రన్ అందిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఫిక్స్ చేశారు. వైజాగ్‌లోని గురుజాడ కళాక్షేత్రంలో ఈ వేడుక జరగనున్నట్టు చిత్రబృందం ప్రకటించారు. సాయంత్రం 6గం.ల నుండి కార్యక్రమం జరుగుతుందని పోస్టర్‌లో తెలిపారు.
ఎన్టీఆర్ కు కూడా జగన్ ఆ ఛాన్స్ ఇవ్వరు : పోసాని