కన్నడ సినీ పరిశ్రమను డ్రగ్స్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా హీరోయిన్ సంజనను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఉదయం బెంగళూరులోని సంజన నివాసంపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడులను నిర్వహించారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మరో నటుడు రాహుల్ శెట్టి ఇచ్చిన సమాచారం మేరకే సీసీబీ అధికారులు సంజన నివాసంపై దాడులు నిర్వహించారు. తమ విచారణలో రాహుల్ పలు వివరాలను వెల్లడించాడని ఈ సందర్భంగా సీసీబీ వర్గాలు తెలిపాయి. సంజన, రాహుల్ ఇద్దరూ కలిసి పలు ప్రైవేట్ పార్టీల్లో పాల్గొనే వారని, పొరుగు దేశాల్లోని పలు కేసినోలకు వెళ్లేవారని తెలిసింది. పార్టీలను నిర్వహించడం, డ్రగ్స్ ను సరఫరా చేయడం వంటి అభియోగాలను రాహుల్ పై మోపినట్టు తెలిపారు. ఇప్పుడు సంజనను విచారిస్తున్నామని చెప్పారు. దీనికి ముందు మరో కన్నడ నటి రాగిణి ద్వివేది నివాసంపై కూడా అధికారులు రెయిడ్ చేశారు.
previous post