telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా పాటలను రీమిక్స్ పేరుతో నాశనం చేస్తున్నారు… రోత పుట్టించేలా ఉన్నాయి… : ఏ.ఆర్ రెహమాన్

AR

ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏ.ఆర్ రెహమాన్ కు ఎందరో సంగీత అభిమానులు ఉన్నారు. ఆయన పాటలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌. అయితే ఇప్పుడు అలంటి ఎన్నో ఎవర్ గ్రీన్ పాటలను రీమేక్ పేరుతో నాశనం చేస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అయివుండి కూడా రెహమాన్ మీడియా ముందుకు ఎక్కువగా రారు. కానీ తన పాటలను రీమిక్స్‌లుగా మార్చి నాశనం చేస్తున్నారంటూ తొలిసారి మీడియా ముందుకు వచ్చి ఆగ్రహ వ్యక్తం చేసారు. “నేను కంపోజ్ చేసిన చాలా పాటలను రీమిక్స్‌లుగా మార్చారు. ఒరిజినల్ పాటను కూనీ చేసేసారు. ఇప్పటివరకు వచ్చిన రీమిక్స్‌లలో నాకు నచ్చిన పాట ‘హమ్మ హమ్మ’ సాంగ్. మిగతావన్నీ రోత పుట్టించేలా ఉన్నాయి. ఒరిజినల్ పాటలను ఇష్టపడేవారు ఇంకా ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. నేను ఇతర పనులతో బిజీగా ఉన్నాను. అందుకే హిందీ సినిమా ఇండస్ట్రీకి కొంతకాలంగా దూరంగా ఉన్నాను. నేను స్టూడియో నిర్మిస్తున్నాను. అందులోనే నా పిల్లలకు సంగీతం నేర్పిస్తాను’’ అని తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్న సినిమాకు సంగీతం అందిస్తున్నారు రెహమాన్.

Related posts