జనసేన అధినేత పవన్‌కల్యాణ్, వైజాగ్‌ని రాజధాని చేసి ఉంటే అద్భుతంగా ఉండేదని అభిప్రాయపడ్డారు. అక్కయ్యపాలెంలో పవన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోదీ, అమిత్ షా అంటే జగన్‌కి భయమని వ్యాఖ్యానించారు. ఏ 2ని పెట్టుకుని జగన్ ఎందుకు తిరుగుతున్నారు?, తనను యాక్టర్ అని విమర్శిస్తున్నారు.. వైసీపీలో యాక్టర్స్ లేరా? అని నిలదీశారు.
దళితులపై జగన్‌కు ఎంత ప్రేమ ఉందో తెలియాలంటే పులివెందుల వెళ్లాలన్నారు. టీడీపీ నేతలు అవినీతి చేస్తే.. అసెంబ్లీకి వెళ్లి ఎందుకు నిలదీయలేదు? అని ప్రశ్నించారు. ఎన్నికల ముందు నియోజక వర్గాలు మారడం గంటా శ్రీనివాస్‌రావుకు అలవాటేనని విమర్శించారు.
ఇకపై అది అధికారికంగా నీ సమస్య… అల్లుడిపై నాగబాబు షాకింగ్ కామెంట్