telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

” అమ్మ మనసు… కపటం లేని మనసు “

కని పెంచిన అమ్మకూ,

కనిపించిన ప్రతి అమ్మకూ, 

కనక పోయినా ప్రేమను పంచే అమ్మలకూ,

తమ స్నేహంతో కన్నుల నీరు తుడుస్తున్న ప్రతి అమ్మకూ మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు..!! 

 

అందంగా ఉన్నా, లేకున్నా,

ఆస్తి అంతస్తులు ఉన్నా, లేకున్నా,

ఎవరు ప్రేమించినా, ప్రేమించకపోయినా,

నిరంతరం ప్రేమించేది మాత్రం అమ్మ ఒక్కటే..!!

 

ఆది గురువై, నిను నిరంతరం శిల్పంలా చెక్కుతూ,

ప్రపంచం మొత్తం నిను గుర్తించేలా,

పాటుపడిన అమ్మే నీ తొలి గురువు..!! 

 

నీ సాహసాలను భరించి,

నీ వెన్నంటే ఉంటూ,

నీ నీడలా మారి,

నిత్యం నేను కాపలా కాసేది అమ్మ ఒక్కటే..!! 

 

తన సుఖసౌఖ్యాలు మరిచిపోయి,

నిలువెల్లా కరిగిపోయి,

తన బిడ్డ కడుపు నిండితే చాలు అనుకునే పిచ్చిది..!! 

ఈ ప్రపంచంలో ఒక్క అమ్మ మాత్రమే..!!

 

ఎన్ని యజ్ఞాలు చేసినా,

నిలువెత్తు ధనం పోసినా, 

తిరిగి తీర్చుకోలేనిది అమ్మ బుణం మాత్రమే..!!

 

అమ్మ చిరునవ్వులు చాలు ఆనందంగా గడపడానికి..!! 

అమ్మ దీవెనలు చాలు పైకి ఎదగడానికి..!!

జీతభత్యాలు లేని నిరంతర శ్రామికురాలు అమ్మ..!!

త్యాగానికి మారు పేరు అమ్మ..!! 

మమకారానికి ముద్దు పేరు అమ్మ..!!

అనురాగ, ఆప్యాయతల కోసం 

దేవుడు చెక్కిన బొమ్మ అమ్మ..!!

అమ్మ గుండెల్లో ప్రేమ..!!

అమ్మ పాదాల దగ్గర యింత చోటు..!! 

చాలదా ఈ జన్మ కి..!!

 

Related posts