ప్రతి రాజకీయ నాయకుడికీ హిందువుల ఓట్లు కావాలే తప్ప , హిందూ ధర్మం పట్టడం లేదని పరిపూర్ణానంద స్వామి ఆరోపించారు. ఈ రోజు ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ హిందూమతంలోకి అన్య మతస్తులు ప్రవేశిస్తుంటే పాలకులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
తాను తిరుమల నుంచి అమరావతి వరకూ పాదయాత్రగా వెళ్లి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైస్ జగన్ కు మెమొరాండం సమర్పించనున్నట్టు తెలిపారు. టీటీడీలో హైందవేతర ఉద్యోగులను తక్షణం బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ కమీషన్ల వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి: దేవినేని ఉమ