*జంగారెడ్డిగూడెంపై టీడీపీ పట్టు..
*11మంది టీడీపీ సభ్యులు ఒక్కరోజు సస్పెన్షన్..
*నిన్న టీడీపీ ఇచ్చిన ప్రివిలేజ్ మోషన్ తిరస్కరణ
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో సస్పెన్షన్ పర్వం కొనసాగుతుంది.. టీడీపీ సభ్యులు అందరినీ ఒక రోజు పాటు అసెంబ్లీ సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు ఇచ్చారు.
గురువారం ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి జే బ్రాండ్స్ మద్యం, నాటుసారాతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. సభలో చప్పట్లు కొడుతూ నిరసన తెలిపారు. దీంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ సభ్యుల ఆందోళనపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం శాసనసభ్యులు ఒక్కరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.టీడీపీ సభ్యులు సభ సజావుగా జరగనివ్వడం లేదని, సభను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. నిన్న సీఎం జగన్‌మోహన్ రెడ్డిపై ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసును ఆర్డర్‌లో లేదని తిరస్కరిస్తున్నట్టు తెలిపారు.
డాక్టర్ సుధాకర్ పై ప్రభుత్వానికి ఎలాంటి కక్ష లేదు: మంత్రి అవంతి